గబ్బర్ సింగ్ సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Pawan Kalyan Gabbar Singh Movie :హిట్ ,ప్లాప్ లతో సంబంధం లేకుండా ఫాన్ ఫాలోయింగ్ ఫుల్లుగా గల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత ఆ రేంజ్ లో సరైన హిట్ పడలేదు. సరిగ్గా అదే సమయంలో హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ గత రికార్డులను తిరగరాసింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ మూవీ ఫాన్స్ కి కావలసిన అన్ని హంగులతో రూపొందింది.
2012మే 11న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 60కోట్ల షేర్ కెలెక్ట్ చేసి, బ్లాక్ బస్టర్ అయింది.ఈ సినిమాకు కొంచెం అటు ఇటుగా రెండు వారాల గ్యాప్ తో వచ్చిన సినిమాలను తట్టుకుని మరీ గబ్బర్ సింగ్ సత్తా చాటింది.
గబ్బర్ సింగ్ కి రెండు వారాల ముందు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో జూనియర్ నటించిన దమ్ము మూవీ రిలీజయింది. తారక్ నటన బాగున్నప్పటికీ పెద్దగా అందుకోలేదు. దానికి తోడు గబ్బర్ సింగ్ రిలీజ్ తో దమ్ము నెగెటివ్ లోకి వెళ్ళిపోయింది. అయితే 30కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటో చూపించింది.
గబ్బర్ సింగ్ కి రెండు వారాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటించిన దరువు మూవీ రిలీజయింది. డైరెక్టర్ శివ తీసిన ఈ మూవీ ఏవరేజ్ తో మిగిలింది. దరువు మూవీకి ఒకరోజు ముందుగా గురువారం ఆధ్యాత్మిక మూవీ రిలీజయింది. విలన్ పాత్రలతో అదరగొట్టే రామిరెడ్డి సాయిబాబా పాత్రతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సుమన్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి సరైన ప్రమోషన్ లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలీని పరిస్థితి. తమిళ మూవీకి తెలుగు వెర్షన్ లో వచ్చిన లవ్ జర్నీ మూవీలో జై హీరోగా చేసాడు.

