MoviesTollywood news in telugu

దేవత సీరియల్ చైల్డ్ ఆర్టిస్టు దేవమ్మ రియల్ లైఫ్

Devatha serial child artist Devamma :ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ ఆడియన్స్ అభిమానాన్ని చూరగొంది. ఇందులో నటించే నటీనటులు తమ టాలెంట్ చూపిస్తూ బుల్లితెర ఆడియన్స్ ని అలరిస్తున్నారు. మిగిలిన సీరియల్స్ కి ఈ సీరియల్ గట్టి పోటీ కూడా ఇస్తోంది. ఆదిత్య,రుక్మిణి; సత్యల చుట్టూ తిరుగుతోంది. రోజుకో ట్విస్ట్ తో నడుస్తున్న ఈ సీరియల్ లో రుక్మిణి బయటకు వెళ్ళాక ఓ పాపకు జన్మనివ్వడం,ఆ పాప క్యారెక్టర్ లో ఓ చైల్డ్ ఆర్టిస్టు నటిస్తోంది.

ఆమె పేరు ఆహానా బర్ఫీ. ఈ పాప ఎంట్రీ ఇచ్చి కొద్దిరోజులే అయినా తన క్యూట్ లుక్స్, నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాప హైదరాబాద్ లో జనవరి 28న జన్మించింది. స్టార్ మాలో ప్రసారమైన చిట్టితల్లి సీరియల్ ద్వారా కూడా అహానా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం డాన్స్, సింగింగ్ నేర్చుకుంటోంది.

సోషల్ మీడియాలో టిక్ టాక్ షోస్, థట్స్ మై వీడియోస్ వంటి కార్యక్రమాలతో అందరికీ సుపరిచితమైన అహనా బర్ఫీ తెలంగాణా వండర్ కిడ్స్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా సపోర్ట్ చేస్తూ, సామాజిక అంశాలపై తన పాత్ర పోషిస్తోంది. కొన్ని కవర్ సాంగ్స్, మోడలింగ్ లో కూడా చేసి, కొన్ని సీరియల్స్ లో,షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. బతుకమ్మతో మంచి పాపులార్టీ వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."