MoviesTollywood news in telugu

ఓటీటీ బాటలోనే స్టార్ హీరోస్ మూవీస్ …ఎప్పుడో తెలుసా?

Tollywood Ott Movies :కరోనా ప్రభావం ఇంకా తగ్గే సూచనలు కనిపించపోవడంతో థియేటర్లు తెరిచినా ఆడియన్స్ వచ్చేది అంతంత మాత్రమేనన్న మాటలు విన్పిస్తున్నాయి. అంచనాలు కూడా అలానే ఉన్నాయి. మరోపక్క తక్కువ రేట్లతో థియేటర్లను నడపడం కూడా కష్టమేనని దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వాళ్ళు ఇప్పటికే చెప్పేసారు. పైగా లాక్ డౌన్ లో ఓటీటీ లో చాలా సినిమాలు వచ్చాయి.

ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ నటించిన రీమేక్ మూవీ నారప్ప కూడా అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. ఇందుకు గాను భారీ మొత్తం కూడా వచ్చినట్లు టాక్ నడిచింది. అలాగే వెంకటేష్ దృశ్యం 2 కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ, గోపీచంద్ నటించిన సిటీ మార్ కూడా అమెజాన్ ప్రైమ్ లో రాబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఒప్పందాలు కూడా అయ్యాయట.

మరో పక్క నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీశ్’ కూడా ఓటిటి బాట పడుతున్నట్లు తాజాగా వినిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ తో ఇప్పటికే ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అలాగే శర్వానంద్,సిద్ధార్ధ్ నటిస్తున్న మహా సముద్రం మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా 21కోట్లకు ఒప్పందం కుదిరిందన్న వార్తలు వస్తున్నాయి. అలాగే నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో మూవీకి హాట్ స్టార్ లో రిలీజ్ కోసం 28కోట్ల ఢీల్ ఒకే అయిందని టాక్.