మొదటి సినిమాతోనే మనసులు దోచేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా…?

Tollywood Actress priyanka jawalkar childhood Photo : టాక్సీవాలా మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్ తన గ్లామర్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. పైగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

తాజాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య హీరో సత్యదేవ్ హీరోగా చేసిన తిమ్మరుసు , అలాగే కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ఎస్ ఆర్ కల్యాణ మండపం మూవీస్ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకి వచ్చాయి. ఈ రెండింటిలోనూ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ కావడం విశేషం.

తన నటనతో ఆడియన్స్ మనసు దోచుకున్న ప్రియాంక చేతిలో మరో రెండు మూవీస్ ఉన్నాయట. షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తద్వారా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే ఎక్కువ ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. తాజాగా అమ్మచేతిలో ఉన్న చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫాన్స్ కామెంట్స్ తో అదరగొడుతున్నారు.