MoviesTollywood news in telugu

హీరోయిన్ హన్సిక గురించి మనకు తెలియని విషయాలు…అసలు నమ్మలేరు

Tollywood star heroine hansika :పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు మూవీతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తొలిచిత్రంతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఆతర్వాత పలు చిత్రాలు చేసినప్పటికీ తెలుగులో పెద్దగా రాణింపు రాలేదు. అయితే తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న హన్సిక సౌత్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు,తమిళ భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటించిన హన్సిక 1991ఆగస్టు 9న జన్మించింది. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి కష్టపడి పిల్లల్ని పెంచింది. చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ ఇండస్ట్రీలో నటిస్తూ, పెద్దయ్యాక హీరోయిన్ అయింది. 2007లో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బన్నీ సరసన కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. దాంతో మంచి పేరు వచ్చింది.

తమిళనాట జూనియర్ ఖుష్భు గా పేరుతెచ్చుకున్న హన్సికకు గుడి కూడా కట్టేసారు. ఇక 20మంది పిల్లలకు పైగా దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తోంది. పలు సీరియల్స్ లో కూడా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం 50వ సినిమా చేస్తోంది. మహా పేరుతొ తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఆమె చేస్తున్న మై నేమ్ ఈజ్ శృతి మూవీ ఫస్ట్ లుక్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ కావడంతో పలువురు ఫాన్స్ కామెంట్స్ అదరగొట్టారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."