MoviesTollywood news in telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?

Tollywood Heroine pooja hegde :గత ఏడాది సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సరసన నటించి పూజా హెగ్డే కూడా బాగా గ్లామర్ తో పాపులర్ అయింది. బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్ ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంది.తాజాగా ఈమెకు చెందిన చిన్నప్పటి ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పూజా నటించిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అక్కినేని వారసుడు అఖిల్ తో ఈ మూవీలో జతకట్టింది. అలాగే ప్రభాస్ నటించిన రాధేశ్యాం మూవీలో కూడా ఈ అమ్మడు నటించడంతో ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీలో సందడి చేసిన ఈ భామ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్,మహేష్ బాబు కాంబోలో వచ్చే మూవీలో కూడా నటించబోతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అతితక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హోదాతో రాణిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,బన్నీ,ప్రభాస్,మహేష్ బాబు ఇలా అందరి సరసన నటించిన ఈ భామకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె చిన్ననాటి ఫోటో వైరల్ కావడంతో ఫాన్స్ ఖుషి అవుతూ సో క్యూట్ అని కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."