బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న డాన్స్ మాస్టర్ దంపతులు…ఎవరో తెలుసా?
Bigg Boss 5 telugu :ప్రేక్షకులను అలరించటానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ గురించి విషయాలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా పేర్లు .వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కి నాగార్జున పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి చాలా పేర్లు వస్తున్నాయి.బిగ్ బాస్ సీజన్ త్రీ లో వరుణ్ సందేశ్ వితిక జంటను తీసుకున్నట్టే ఈ సీజన్లో కూడా ఒక సెలబ్రిటీ జంట ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది
ఆట సందీప్ అతని భార్య జ్యోతి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆట సందీప్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోల్ పెట్టాడు అందులో తమ జోడిని బిగ్బాస్ లో చూడాలని ఎంత మంది అనుకుంటున్నారు అని అడిగాడు దానికి దాదాపుగా 80 శాతం మంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు
అంతేకాకుండా బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన సందీప్ సస్పెన్స్ అంటూ కామెంట్ చేశాడు. ఈ పోల్ ద్వారా ఆట సందీప్ జంట బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఖాయమని అందరూ అనుకుంటున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఎవరు ఉంటారు అనే విషయం తెలియాలంటే షో ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే బిగ్ బాస్ తెలుగు సీజన్ సెప్టెంబర్ రెండో వారంలో మొదలు అవుతుందని వార్తలు వస్తున్నాయి.