MoviesTollywood news in telugu

వదినమ్మ సీరియల్ నాని సీరియల్స్ కి రాకముందు ఏమి చేసేవాడో…?

vadinamma serial nani (Ganesh) real life :స్టార్ మాలో ప్రసారమవుతున్న వదినమ్మ సీరియల్ లో నటీనటులు తమ నటనతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ్ముళ్ల కోసం బిడ్డలే వద్దనుకుని, తమ్ముళ్ళని సొంత పిల్లలుగా సాకుతున్న పాత్రల్లో ప్రభాకర్, సుజిత బాగా నటిస్తున్నారు. ఇందులో అందరికంటే చిన్నవాడిగా అమాయకపు నటనతో అందరినీ మెప్పిస్తున్న నాని అసలు పేరు గణేష్ రెడ్డి. 1996మార్చి 13న ముంబైలో కేశవరావు,దమయంతి దంపతులకు జన్మించిన ఇతని సొంతూరు ఇచ్ఛాపురం.

ఉద్యోగ రీత్యా గణేష్ ఫ్యామిలీ ముంబై కి చేరడంతో అక్కడ గణేష్ పుట్టాడు. దీప,జ్యోతి అనే ఇద్దరు సిస్టర్స్ గణేష్ కి ఉన్నారు. అయితే ముంబై నుంచి విశాఖకు బదీలీ కావడంతో గణేష్ చదువు అక్కడే పూర్తయింది. హోటల్ మేనేజ్ మెంట్ లో గ్రాడ్యుయేషన్ చేసి, ఓ ఏడాది జాబ్ చేసిన గణేష్ అయితే అనుకోకుండా యాక్సిడెంట్ కావడంతో ఆరునెలలు వైజాగ్ లోని ఇంట్లో ఉండిపోయాడు. పైగా అతడి తండ్రికి దుబాయ్ బదిలీ అయింది. ఇక గణేష్ కి చిన్ననాటి నుంచి డాన్స్,యాక్టింగ్ అంటే ఇష్టం.

గణేష్ డాన్స్ షోస్ లో చేసి, ఆతర్వాత వచ్చిన ఛాన్స్ తో .. నిను తలచి,నా లవ్ సక్సెస్, రిలేషన్, లైలా మజ్ను వంటి 25కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. ఇక అదే సమయంలో వదినమ్మ సీరియల్ కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెల్సి వెళ్ళాడు. అందులో సెలక్ట్ అవ్వడంతో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటాడు. వదినమ్మ సీరియల్ తనకు మంచి గుర్తింపు తెచ్చిందని ఓ ఇంటర్యూలో చెప్పాడు. హీరోస్ లో అల్లు అర్జున్,రణధీర్ కపూర్,హీరోయిన్స్ లో జెనీలియా,సమంత అంటే ఇష్టం.