సినిమాలో కలిసి నటిస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు
Tollywood celebrities :సినిమా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడం,అందునా తమతో నటించే వారితోనే ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కడం సాధారణం. ఇందులో కొన్ని జంటలు బ్రేక్ చెప్పడం, విడాకులు తీసుకోవడం చేసినా, కొన్ని జంటలు పదిలంగా వైవాహిక జీవనం సాగిస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ముందుగా ఒకప్పటి బ్యూటీ స్నేహ ఒకరు. శ్రీరామదాసు,సంక్రాంతి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరి మనస్సులో పదిలమైన స్నేహ ఇండస్ట్రీలో మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే ప్రసన్న అనే ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్ళాడి విసవాహిక జీవితం సాగిస్తోంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 2000లో వచ్చిన వంశి సినిమాలో హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ప్రేమలో పడ్డారు. 2005లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పి, భర్తకు చేదోడు వాదోడుగా నమ్రత ఉంటోంది. వీరికి ఇద్దరు పిల్లలు.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఒకరికొకరు ఇష్టపడి, ప్రేమించుకుని సరైన సమయంలో పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు. అయితే పెళ్లయ్యాక సమంత సినిమాలతో పాటు యాడ్స్, వెబ్ సిరీస్, ఓటిటి లో కూడా బిజీగా మారిపోయింది.
హీరోయిన్ రాధిక చెల్లెలు నిరోషా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అలాగే హీరో రాంకీ కూడా పలు సినిమాలు చేసాడు. వీరిద్దరూ ప్రేమించుకుని 1995లో పెళ్ళిచేసుకుని సెటిలయ్యారు.
ఇక తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమైన ఊర్వశి 1999లో తోడి నటుడు మనోజ్ కె జయన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే మనస్పర్ధలతో విడిపోవడంతో విడాకులు తీసుకుని, 2013లో శివప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది.
బాలివుడ్ బిగ్ బిగ్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్,స్టార్ హీరోయిన్ మిస్ ఇండియా ఐశ్వర్యారాయ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్ షిప్ చేసారు. 2005లో బంతి ఔర్ బబ్లూ లో కల్సి డాన్స్ చేసారు. వీరి ప్రేమ ఫలించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప ఉంది.
1999లో ఓ తమిళ మూవీలో కల్సి నటించిన హీరో సూర్య,హీరోయిన్ జ్యోతిక ప్రేమలో పడ్డారు. అలాగే 1999లో అమరకాలం మూవీలో నటిస్తున్న సమయంలో హీరోయిన్ షాలిని ప్రేమలో పడ్డ హీరో అజిత్ వెంటనే ప్రపోజ్ చేయడం, 2000లో పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. 2006లో ఒకటయ్యారు. టివి నటుడు చేతన్ 2002లో దేవదర్శిని ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి పుట్టిన ముద్దుల తనయ నియతి కూడా ప్రస్తుతం సినిమాల్లో చేస్తోంది.