MoviesTollywood news in telugu

కస్తూరి సీరియల్ నటి ప్రవల్లిక రియల్ లైఫ్

Kasturi serial actress pravallika :బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కి మంచి ఆదరణ ఉండడంతో ఒక ఛానల్ కి మరో ఛానల్ పోటాపోటీగా సీరియల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఛానల్ లో సక్సెస్ ఫుల్ గా రన్నవుతున్న కస్తూరి సీరియల్ లో కస్తూరి చెల్లెలుగా నటిస్తున్న ప్రవల్లిక తన అందంతో, అభినయంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ప్రవల్లిక అసలు పేరు షేక్ షబీనా. అక్టోబర్ 8న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఈమె జన్మించింది. ఈమెను ముద్దుగా డింపుల్ బ్యూటీ అని పిలుచుకునేవారట. జంగారెడ్డిగూడెం జెడ్పి హెచ్ స్కూల్లో చదువుకున్న ఈమె గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది.

చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో ఏబీఎన్, ఐ న్యూస్ వంటి పలు ఛానల్స్ లో యాంకర్ గా చేసిన షబీనా ఆతర్వాత స్టార్ మాలో ప్రసారమైన ప్రదీప్ పెళ్లిచూపులు షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. దాంతో సీరియల్స్ లో ఛాన్స్ రావడంతో అత్తారింటికి దారేది,రోజా,మనసిచ్చి చూడు సీరియల్స్ లో చేసింది. కస్తూరి సీరియల్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న నాపేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తూ, తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది.