MoviesTollywood news in telugu

నిన్నే పెళ్లాడతా సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Meena missed chance in ninnepelladata movie : చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి,అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకెళ్తోంది. విక్టరీ వెంకటేష్ తో దృశ్యం మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక దృశ్యం 2 కూడా పూర్తయింది. రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. ఇక రెమ్యునరేషన్ కూడా బాగానే అందుకుంటోంది.

మొదటి నుంచి కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకుని,మంచి ఇమేజ్ తెచ్చుకున్న మీనా అప్పట్లో కింగ్ నాగార్జునతో ఓ బ్లాక్ బస్టర్ ఫిలిం మిస్సయింది. అప్పట్లో ఎక్కువ ఆఫర్స్ కారణంగా నిన్నే పెళ్లాడతా మూవీలో నాగ్ పక్కన నటించే ఛాన్స్ కోల్పోయింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా మూవీ నాగ్ కి ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. ఈ మూవీలో నాగ్ సరసన టబు నటించి మంచి మార్కులు కొట్టేసింది.

నాగార్జున, టబు ఇద్దరి కెమిస్ట్రీ పండింది. అయితే నిన్నే పెళ్లాడతా మూవీ కోసం 60కాల్ షీట్స్ అడగడంతో,ఎక్కువ సినిమాల్లో చేయడం వలన ఖాళీ లేకపోవడంతో మీనా ఈ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వదులుకోవడంతో ఆ ఛాన్స్ టబుకి దక్కింది. ఈ సినిమా ఛాన్స్ మిస్సయినందుకు మీనా చాలా బాధ పడిందట.