MoviesTollywood news in telugu

ఒకప్పటి ఈ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?

Tollywood Hero And Producer G.V. Narayana Rao :సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలెన్నో ఉంటాయి. డాక్టర్ అవ్వబోయి,యాక్టర్ అయినవాళ్లు ఉన్నట్లే,యాక్టర్ కాబోయి,నిర్మాతగా సెటిలయిన డాక్టర్ రామానాయుడు వంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నటుడిగా తగిన గుర్తింపు లభించకపోవడంతో రూటు మార్చి సక్సెస్ అయినవాళ్లలో నటుడు, నిర్మాత నారాయణరావు ఒకడు.

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందిన నారాయణరావు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాళికట్టు శుభవేళ సాంగ్ తో అంతులేని కథ సినిమాలో చేసిన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ లాంటి పలు సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇవి పెద్దగా ఆడక పోవడంతో తర్వాత నుంచి సరైన ఛాన్స్ లు రాలేదు.

దాంతో నిరాశ చెందకుండా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. సుధాకర్,శివప్రసాద్ లతో కల్సి చిరంజీవితో యముడికి మొగుడు మూవీ నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత పలు సినిమాలను నిర్మించి, ఎందరో నటీనటులకు ఛాన్స్ ఇచ్చాడు. పోయినచోటే వెదుక్కోవాలన్న సామెత మాదిరిగా ఇండస్ట్రీలోనే నటుడిగా దక్కని గౌరవం, నిర్మాతగా దక్కించుకున్నాడు. ఒక వైపు సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు టీవి రంగంలో కూడా సిరియల్స్ నిర్మిస్తు బిజీగా గడిపేస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."