MoviesTollywood news in telugu

స్వర్ణకమలంలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిందెవరో తెలుసా ?

swarna kamalam Movie :సినిమా జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తారో నిజ జీవితంలో కూడా అలానే తుదిశ్వాస విడిచిన అతికొద్దిమందిలో స్వర్ణకమలంలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిన వ్యక్తి ఒకరు. విక్టరీ వెంకటేష్,భానుప్రియ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

విక్టరీ వెంకటేష్ కి క్లాసికల్ హీరోగా మంచి పేరు తెచ్చిన స్వర్ణకమలం మూవీలో హీరోయిన్ భానుప్రియ తండ్రిగా ఏలూరు కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం సత్యనారాయణ శర్మ నటించారు. ఈయన ఎందరికో నాట్యం నేర్పారు. అయితే ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో ఈయన గురించి టైటిల్స్ లో పెద్దగా ప్రస్తావించకపోవడం అప్పట్లో చర్చకు దారితీసింది.

నిజజీవితంలో నాట్యాచార్యునిగా ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్న వేదాంతం సత్యనారాయణ శర్మ ఒక చోట స్టేజ్ ప్రదర్శన ఇస్తూ ప్రాణాలు విడిచారు. అయితే స్వర్ణ కమలంలో మూవీలో కూడా తన కూతురు నాట్యం పట్ల చూపిస్తున్న వైఖరికి నొచ్చుకుని తానే నాట్యం చేస్తూ ప్రాణాలు విడుస్తాడు. కానీ నిజజీవితంలో కూడా నాట్యం చేస్తూనే మరణించారని ఆ మధ్య ఓ ఇంటర్యూలో కళాతపస్వి కె విశ్వనాధ్ చెప్పుకొచ్చారు.