MoviesTollywood news in telugu

చెర్రీ, శంకర్ కాంబోలో వచ్చే మూవీ ఖర్చు ఎంతో తెలుసా ?

Shankar and Ram Charan New Movie :తమిళంలో కమల్ హాసన్ తో భారతీయుడు,రజనీకాంత్ తో రోబో,2.ఓ, విక్రమ్ తో అపరిచితుడు వంటి భారీ హిట్ మూవీస్ తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ శంకర్ మూవీస్ అంటే బడ్జెట్ భారీ స్థాయిలోనే ఉంటుంది. బడ్జెట్ విషయంలో శంకర్ ఎక్కడా రాజీ పడబోడని చెబుతారు.

కమల్ తో భారతీయుడు సీక్వెల్ మొదలు పెట్టినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయింది .ఇక అపరిచితుడు బాలీవుడ్ లో తెరకెక్కించాలని శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీకి ఒకే చెప్పాడు. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు భారీ ఎత్తున బడ్జెట్ పెడుతున్నట్లు టాక్. విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ కి భారీ ఖర్చు చేశారట.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు తీసే 50వ సినిమా కావడం విశేషం. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టారు. అంతేకాదు,ఒక కోటి 73లక్షలతో పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. దీన్ని బట్టి సినిమా ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో ఊచించవచ్చు. రామ్ చరణ్,కియారా అద్వానీ,శంకర్,దిల్ రాజు మొదలైనవారు సూటు బూట్లు వేసుకుని స్టైలిష్ లుక్ తో పోస్టర్ చక్కర్లు కొడుతూ ఆకట్టు కుంటోంది.