యాంకర్‌ రవి బిగ్‌బాస్‌ షో కోసం వారానికి ఎంత…? క్రేజ్ మామూలుగా లేదుగా…?

Anchor ravi remuneration for bigg boss telugu :బుల్లితెర మీద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 సందడిగా సాగుతోంది. మొత్తం 19మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న ఈ షోకి కింగ్ నాగార్జున యాంకరింగ్ అదరగొడుతున్నాడు. ఇక కంటెస్టెంట్స్ లో మోస్ట్‌ వాంటెడ్‌ యాంకర్లలో ఒకరైన యాంకర్ రవి ఉన్నాడు. తన కామెడీతో,పంచులతో టీవీ ప్రేక్షకులను నవ్వించే ఇతడు బిగ్‌బాస్‌ హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే కావాల్సినంత పాపులారిటీ, చేతినిండా సంపాదించుకునే సత్తా ఉన్న యితడు బిగ్ బాస్ షోలో ఎందుకు పాల్గొంటున్నాడో స్టేజీ మీదే సమాధానమిచ్చాడు.

ఇప్పటివరకు తనను యాంకర్‌ రవిగానే చూశారే తప్ప రవికిరణ్‌గా చూడలేదని, తన వ్యక్తిత్వం, వైఖరిని ప్రజలకు చూపించేందుకే బిగ్‌బాస్‌కు వచ్చానని యాంకర్ రవి చెప్పుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు వార్తలు వైరల్ అవ్వడంతో యాంకర్ రవికి భారీగానే ముట్టజెబుతున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే సీజన్ 4లో సరైన కంటెస్టెంట్స్ లేరని, ఊరు పేరు లేని వాళ్ళను తీసుకొచ్చారని విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో సీజన్ 5కి పక్కాగా కంటెస్టెంట్స్ సెలక్షన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఎవరి ఊహలకు అందనంతగా సెలెక్షన్ కన్పిస్తోంది. పలు షోస్ ని ఎక్కడికక్కడ వదిలేసి వచ్చినందుకు వారానికి యాంకర్ రవి 3నుంచి 5లక్షల వరకూ అందుకుంటున్నది టాక్. ఫైనల్ దాకా చేరుకుంటే అరకోటి పైగానే వస్తుందని లెక్కలేస్తున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కి కూడా భారీగానే ముట్టజెబుతున్నారని చర్చ నడుస్తోంది.