ఒకే రోజు రిలీజైన బాలయ్య రెండు సినిమాల పరిస్థితి ఏమిటి…?
Tollywood hero BalaKrishna :సూపర్ స్టార్ కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే నెలలో నాలుగైదు రిలీజయిన సందర్భాలున్నాయి. అయితే ఒకే రోజున ఒకే హీరోకి సంబందించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం అనేది చాలా అరుదుగా చూస్తాం. కానీ ఇలాంటి ఘటన నందమూరి తారకరామారావు కి 1961సెప్టెంబర్ 5న ఎదురైంది. సతీ సులోచన,పెండ్లి పిలుపు మూవీస్ రిలీజయ్యాయి. అయితే ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. కాగా నటసింహం బాలకృష్ణ విషయంలో ఇలాంటి ఘటన రావడంతో ఒకటి సూపర్ హిట్,ఒకటి ప్లాప్ గా మిగిలింది.
అవి నిప్పురవ్వ,బంగారు బుల్లోడు. ఈ రెండు సినిమాలకు రాజ్ కోటి సంగీతం అందించారు. బాలయ్య,విజయశాంతి హిట్ కాంబినేషన్ గా ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే విజయశాంతి నిర్మించి, నటించిన నిప్పురవ్వ సినిమాలో బాలయ్య హీరో. ఏ కోదండరామిరెడ్డి డైరెక్టర్. కానీ ఈ సినిమా షూటింగ్ జాప్యం కావడం, తీరా 1993 సెప్టెంబర్ 3న రిలీజయ్యాక ప్లాప్ కావడం ఫాన్స్ కి ఇబ్బంది కల్గించింది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ప్లాప్ కావడంతో బాలయ్య విజయశాంతి ఇక కల్సి నటించలేదు.
అయితే నిప్పురవ్వ రిలీజ్ రోజునే రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన బాలయ్య నటించిన బంగారు బుల్లోడు కూడా విడుదలైంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్రప్రసాద్ నిర్మించారు. గతంలో దసరా బుల్లోడు,బంగారు బాబు మూవీస్ తీసిన విబి రాజేంద్రప్రసాద్ ఈ మూవీకి రెండు సినిమాల పేర్లు కల్సి వచ్చేలా బంగారు బుల్లోడు అనే టైటిల్ పెట్టారు. రవీనా టాండన్,రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది.

