ఈ ఫోటోలో ఉన్న తెలుగు బిగ్ బాస్ 5 బ్యూటీ ని గుర్తు పట్టారా…?

Bigg Boss 5 telugu swetha varma : వరుసగా నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని 5వ సీజన్ లోకి అడుగుపెట్టి, నడుస్తున్న బిగ్‌బాస్‌ సీజన్ 5 రియాల్టీ షో గురించి పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చిపడుతున్నాయి. మన సంస్కృతిపై దాడిగా విమర్శకులు బాణాలు ఎక్కుపెడుతున్నారు. అంతేకాదు,బాన్ చేయమని అంటున్నారు. తిట్టుకునేవాళ్ళు, విమర్శించేవాళ్లు ఉన్నట్టే ఈ షోకి ఫాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు.

ప్రస్తుతం 19మంది కంటెస్టెంట్స్ తో స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా అదరగొడుతున్నాడు. ఇక కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ గేమ్ ని రక్తి కట్టిస్తున్నారు. నాల్గవ సీజన్ మాదిరిగానే 5వ సీజన్ లో కూడా జనాలకు అంతగా తెలీనివాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వారం దాటినా సరే, ఇంకా స్క్రీన్ మీదకు రానివాళ్లు ఉన్నారు.

ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ చిన్నప్పటి ఫోటోలు అంటూ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలు ఎవరివా అని నెటిజన్స్ ఆరా తీస్తుంటే, రెండో వారం నామినేషన్ లో హోమిదా, లోబోపై విరుచుకుపడ్డ శ్వేతవర్మ అని తేలింది. మొన్నటికి మొన్న బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు రచ్చ చేసింది. అలాగే కంటెస్టెంట్స్ ముఖాలపై రంగులు కూడా పూసేసింది.