MoviesTollywood news in telugu

నితిన్ కెరీర్ లో టాప్ 10 సినిమాలు…మీరు చూసారా…?

Tollywood Hero Nithin Top 10 Movies :జయం మూవీతో 2002లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ హీరో నితిన్ తొలి మూవీతోనే అదరగొట్టాడు. తేజ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో హీరో నితిన్,హీరోయిన్ సదా నటన సూపర్భ్. ఇక విలన్ గా గోపీచంద్ అదరగొట్టాడు. ఆర్ఫీ పట్నాయక్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. ఏకంగా 12సాంగ్స్ చేసి అదరగొట్టారు.

ఇక వివి వినాయక్ డైరెక్షన్ లో 2003లో వచ్చిన దిల్ మూవీ కూడా సూపర్ హిట్. ఈ సినిమా తోనే నిర్మాత రాజు దిల్ రాజు అయ్యారు. హీరోయిన్ నేహా గ్లామర్, వేణుమాధవ్ కామెడీ అలరించగా, ఇక ఆర్ఫీ పట్నాయక్ మ్యూజిక్ అదిరింది.

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సై మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. జెనీలియా హీరోయిన్. రబ్బీ గేమ్ ఇందులో స్పెషల్. 2004లో వచ్చిన ఈ మూవీకి కీరవాణి అందమైన బాణీలు అందించారు.

యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించిన శ్రీ ఆంజనేయం మూవీలో నితిన్ చేత మంచి యాక్షన్, సెంటిమెంట్ డ్రామా పండించాడు డైరెక్టర్ కృష్ణవంశీ. 2004లో వచ్చిన ఈ మూవీలో హీరో దైవభక్తి, హీరోయిన్ ఛార్మి ప్రేమ మరోపక్క ఆకట్టుకుంటాయి.

చాలా రోజుల గ్యాప్ తర్వాత హిట్ అందుకున్న మూవీ ఇష్క్. 2012లో వచ్చిన ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నితిన్ నటన ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్.

జయకుమార్ కొండ డైరెక్షన్ లో 2013లో వచ్చిన గుండెజారి గల్లంతయింది మూవీ లో నితిన్,నిత్యా జంటగా అలరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అదిరింది.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన హార్ట్ ఎటాక్ మూవీ కొత్తదనంతో ఆకట్టుకుంది. అనూప్ రూబెన్స్ మీజిక్ అలరించింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నితిన్,సమంత జంటగా నటించిన అఆ మూవీ ఏకంగా 75కోట్ల హయ్యెస్ట్ కలెక్షన్ తెచ్చింది. అత్త పాత్రలో నదియా నటనతో మెప్పించింది.

రష్మిక మందన్న తో కల్సి నితిన్ చేసిన భీష్మ మూవీ సూపర్ హిట్ అయింది. 2020లో వచ్చిన ఈ మూవీకి వెంకీ కొడుముల డైరెక్టర్.

కీర్తి సురేష్ తో కల్సి నటించిన రంగ్ దే మూవీ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 2021లో వచ్చింది.