అత్తారింటికి దారేది సీరియల్ ముకుంద్ రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించాడో…?
Attarintiki daredi serial fame mukund real life :ఈటీవీలో ప్రసారమువుతూ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొందుతున్న అత్తారింటికి దారేది సీరియల్ లో నటీనటులు తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుస్తున్న ఈ సీరియల్ విశేష ఆదరణ పొందుతోంది. మంచి టీఆర్ఫీ రేటింగ్ తో నడుస్తోంది. ఇక ఇందులో నటిస్తున్న ముకుంద్ తన నటనతో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఆడియన్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ముకుంద్ అసలు పేరు శ్రవణ్ కుమార్. సెప్టెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ అనంతంపురం జిల్లా మిధురవాద అనే గ్రామంలో వ్య్వవసాయ కుటుంబానికి చెందిన పెద్దిరెడ్డి,లక్ష్మీదేవి దంపతులకు శ్రవణ్ జన్మించాడు. ఇతడికి రాధ అనే ఓ చెల్లి ఉంది. ముకుంద్ బెంగుళూరులో మావయ్య, బాబాయ్ ల దగ్గర పెరిగాడు. అక్కడే స్కూల్ విద్య పూర్తిచేసాడు. విజయవాడ చైత్యన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసాడు. బెంగుళూరులో సివిల్ ఇంజనీరింగ్ చేసాడు.
రెండేళ్లు స్ట్రక్చరల్ ఇంజనీర్ గా చేసిన శ్రవణ్ కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. బాబాయ్ ఎంకరేజ్ మెంట్ తో ఉద్యోగం వదిలేసి, వైజాగ్ సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నాడు. బెంగుళూరు వెళ్లి ఆడిషన్స్ లో పాల్గొని ఓ కన్నడ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. అయితే షూటింగ్ పూర్తికాకముందే మధ్యలో ఆగిపోయింది.
అయితే షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ లో యాక్ట్ చేసి,కన్నడ ఆడియన్స్ ని అలరించాడు. సూపర్ బాయ్ అనే బిరుదు ఇచ్చారు. తెలుగులో ఒక చిన్న విరామం అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. ఓ షార్ట్ ఫిలిం కూడా చేసాడు. ఇక అత్తారింటికి దారేది సీరియల్ లో ఆడిషన్స్ కి వెళ్లి సెలెక్ట్ కావడంతో ముకుంద్ గా నటిస్తున్నాడు.

