MoviesTollywood news in telugu

‘భరత్ అనే నేను’ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి…?

Mahesh Babu Bharat Ane Nenu Movie :కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను మూవీలో నటించి సూపర్ స్టార్ మహేష్ తన ఇమేజ్ మరింత పెంచుకున్నారు. ఒక సోషల్ మెసేజ్ ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ మూవీ 150కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. 2018 ఏప్రియల్ 20న రిలీజైన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మంచి బాణీలు అందించారు. అయితే ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాలను పరిశీలిస్తే, మంచు విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్ర లో విష్ణుతో పాటు బ్రహ్మానందం బ్రాహ్మణులుగా నటించి ఆకట్టుకున్నారు. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్లాప్ అయింది.

ఇక ఏప్రియల్ 27న కణం మూవీ రిలీజయింది. నాగసౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. భరత్ అనే నేను మూవీకి రెండు వారాల తర్వాత వచ్చిన అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ రిలీజయింది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బన్నీ మార్క్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.

ఏప్రియల్ 5న నితిన్ నటించిన చల్ మోహన్ రంగా మూవీ రిలీజయింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశ పరిచింది. భరత్ అనే నేను మూవీకి వారం ముందు ఏప్రియల్ 13న రిలీజైన ప్రభుదేవా నటించిన మెర్క్యురీ మూవీ ని కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసారు. హర్రర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ కూడా ప్లాప్ అయింది.

దానికన్నా ముందు ఏప్రియల్ 6న వచ్చిన గులేబాకవళి మూవీ వచ్చింది. ప్రభుదేవా,హన్సిక నటించిన ఈ మూవీని కళ్యాణ్ తెరెకెక్కించారు. అయితే ప్లాప్ అయింది. దీంతో పాటే ఇంతలో ఎన్నెన్ని వింతలో మూవీ లో నందు హీరోగా చేసాడు. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇక ఏప్రియల్ 12న నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీ వచ్చింది. నాని డబుల్ రోల్ చేసిన ఈ మూవీని మేర్లపాక గాంధీ తెరకెక్కించారు. వారం పాటు బాగానే నడిచినా, భరత్ అనే నేను మూవీ ముందు ఆగలేక ప్లాప్ గా మిగిలింది.

సత్య గ్యాంగ్ మూవీ కూడా భరత్ అనే నేను మూవీకి రెండు వారాల ముందు వచ్చింది. ప్రభాస్ నిర్మల డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిరాశపరిచింది. అయితే భరత్ అనే నేను మూవీకి 19రోజుల తర్వాత వచ్చిన మహానటి మంచి పోటీ ఇచ్చింది. నాగ అశ్విన్ డైరెక్టర్ గా చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ మహానటి సావిత్రిగా నటించి అలరించింది.