MoviesTollywood news in telugu

రష్మిక ధరించిన శారీ,ఉంగరం ఖరీదెంతో తెలుసా ?

Rashmika mandanna necklace finger ring cost : సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం వలన ఫోటోలు, వీడియోలు కూడా ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ ఫాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. దాంతో వాళ్ళు ధరించిన వస్తువులు,దుస్తులు అన్నింటి గురించి చర్చ నడుస్తోంది. వాటి ఖరీదు గురించి సెర్చ్ చేస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఓ వార్త వైరల్ ఐంది. ప్రస్తుతం అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీలో ఈమె నటిస్తోంది. డిసెంబర్ 17న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రష్మిక కట్టుకున్న చీర, ధరించిన ఉంగరం ఇప్పుడు వైరల్ గా మారాయి.

షాపింగ్ వెళ్తే, ఏది కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతానని, అందుకే ఆన్ లైన్ షాపింగ్ చేస్తానని రష్మిక చెప్పుకొచ్చింది. ఆమె కట్టిన చీరను ప్రముఖ డిజైనర్ అశ్విని రెడ్డి డిజైన్ చేసారు. ఈ శారీ ఖరీదు 48వేల రూపాయలట. త్యాని బై కరణ్ జోహార్ జ్యుయలరీలో బంగారు వస్తువులు కొన్నారు. ఆమె మెడలో ధరించిన హారం ఖరీదు 2లక్షల 86వేల 300రూపాయలట. ఇక ఆమె ధరించిన ఉంగరం 97వేలు ఖరీదు చేస్తుందట.