‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Sarkaru vari pata Movie mahesh babu remuneration :మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సర్కారువారి పాట మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మహేష్ సరసన మహానటి ఫేమ్ కీర్తిసురేష్ జోడీ కడుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సర్కారు వారి పాట మూవీ టీజర్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన కొద్దిసేపటికే భారీ వ్యూస్ తో దూసుకెళ్లింది.
ఇప్పటికే 38 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో అవుతోంది. భారీ బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న తండ్రిని కాపాడుకునే కొడుకు పాత్రలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని వినిపిస్తోంది. ఇక ఈ మూవీ కోసం మహేష్ బాబు భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్.
వాస్తవానికి టాలీవుడ్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్స్ పరంగా దూకుడు ఉంటుంది. అందుకే దర్శక నిర్మాతలు మహేష్ తో మూవీ చేయాలని ట్రై చేస్తుంటారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే మహేష్ 50కోట్లవరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు విన్పిస్తోంది.
