మెగాప్రిన్స్ హీరోయిన్ చిన్నప్పటి పిక్స్ వైరల్…గుర్తు పట్టారా….?

Tollywood Heroine :ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన గద్దల కొండ గణేష్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన యంగ్ బ్యూటీ మృణాళిని రవికి చెందిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన మరుక్షణం వేలల్లో, లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటాయి. లైక్ లు,కామెంట్స్ అదిరిపోతుంటాయి.

సినిమాల్లో ఒక్క ఛాన్స్ వచ్చినంత మాత్రాన, అందం అభినయం బాగున్నంత మాత్రాన ఛాన్స్ లు రావు. అదృష్టం కూడా ఉండాలి. మృణాళిని రవికి గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాలేదు. అందుకే రూటు మార్చి ప్రస్తుతం తమిళ సినిమాల్లో చేస్తోంది.

ప్రస్తుతం తమిళ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘కోబ్రా’ మూవీలో ప్రాధ్యాన్యత గల పాత్ర చేస్తున్న మృణాళినిరవి మరోపక్క ఎనిమీ అనే మరో మూవీలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. కాగా తన చిన్నప్పుడు తండ్రి ఎత్తుకున్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫాన్స్ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.