Movies

వడ్డే నవీన్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడిగా టాలీవుడ్ హీరోగా పరిచయమైన వడ్డే నవీన్ పలు సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరై, హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే మొన్న మా ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఓటు వేయడానికి వచ్చిన నవీన్ తళుక్కున మెరిశాడు. మంచి కథలు, మంచి పాత్రలు వస్తే సినిమాలు చేసేందుకు సిద్దమని మీడియాకు వెల్లడించిన నవీన్ ఇక ఇంటర్వ్యూలు ఇచ్చేంత అవసరం రాలేదని, త్వరలోనే అవి కూడా ఇస్తానని అన్నాడు.

1990 ప్రాంతంలో వచ్చిన సూపర్ హీరోలలో ఒకడైన నవీన్ కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. మొదటి సినిమాతోనే మంచి నటుడని అనిపించుకున్న నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, మా బాలాజీ, బాగున్నారా, నా ఊపిరి… ఇలా దాదాపు 30 లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ లలో హీరోగా నటించి తనకంటూ ఓ ఇమేజ్ సొంతంచేసుకున్నాడు.

అయితే పీక్ స్టేజ్ లో కెరీర్ నడుస్తున్న సమయంలో నవీన్ తెరపైన కనుమరుగయ్యారు. 2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ మూవీ నవీన్ చివరిగా కన్పించిన మూవీ. ఆ తర్వాత కనీసం బయట ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్ కావడం కూడా నవీన్ సినిమాలకు దూరం కావడానికి కూడా ఓ కారణం. ప్రస్తుతం బిజినెస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."