MoviesTollywood news in telugu

ఈగ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?

Eega Movie Unknown facts :మగధీర తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నాని కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్. కన్నడ నటుడు సుదీప్ విలన్ గా చేసాడు. విజువల్ వండర్స్ కి ప్రాధాన్యత నిస్తూ తీసిన ఈ సినిమా ఆద్యంతం అలరించి,మంచి కలెక్షన్స్ రాబట్టింది. 2012జులై 6న రిలీజైన ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ లో 42కోట్ల షేర్ రాబట్టి, అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఈగ మూవీకి రెండు వారాల ముందుగా జూన్ 23న రిలీజైన మేం వయస్సుకి వచ్చాం మూవీ లో తనీష్,నీతి జంటగా నటించారు. అయితే ఈ మూవీ నిరాశపరిచింది. శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ఆల్ ది బెస్ట్ మూవీ ఈగ మూవీకి వారం ముందు రిలీజయింది. జెడి చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అజిత్ హీరోగా నటించిన డబ్బింగ్ మూవీ డేవిడ్ భిల్లా మూవీ జులై 13న వచ్చింది. అయితే తెలుగులో ప్లాప్ అయింది.

జులై 20న తూనీగ తూనీగ మూవీ వచ్చింది. ఎం ఎస్ రాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సుమంత్ అశ్విన్, రియా చక్రవర్తి జంటగా నటించారు. బిలో ఏవరేజ్ అయింది. ఆతర్వాత భారీ అంచనాల నడుమ బాలయ్య, మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా మూవీ రిలీజయింది. భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి గానీ సినిమా ప్లాప్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."