పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల ఆస్తి ఎన్ని కోట్లో…?
Pelli SandaD Heroine Sreeleela :శ్రీకాంత్ హీరోగా అప్పట్లో వచ్చిన పెళ్ళిసందడి మూవీ బ్లాక్ బస్టర్ కావడం, మళ్ళీ ఇన్నాళ్లకు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా అదే పేరుతొ సినిమా రావడం తెల్సిందే. అయితే ఈ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న శ్రీలీలను లీల, స్వీటీ అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. 2001జులై 14న అమెరికాలోని డెట్రాయిట్ లో జన్మించిన ఈమెకు 20ఏళ్ళు నిండాయి. ఈమె తండ్రి శుభకరరావు బిజినెస్ మ్యాన్. ఈమె తల్లి స్వర్ణలత డాక్టర్ . శ్రీలీలకు శ్రీకర్, శ్రీదీప్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు.
శ్రీ లీల ఫ్యామిలీ బెంగుళూరుకి షిఫ్ట్ అవ్వడంతో అక్కడే స్టడీస్ పూర్తిచేసింది. తల్లి బాటలో డాక్టర్ అవ్వాలని డాక్టర్ చదవడం మొదలు పెట్టింది. ఆ సమయంలోనే భరత నాట్యం నేర్చుకుంటూ, ఫ్రెండ్స్ తో కల్సి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. క్యాట్ వాక్ చేసింది. అయితే ఈమెకు ఒక్క అబ్బాయి కూడా ఇప్పటి వరకూ ప్రపోజ్ చేయలేదని ఓ ఇంటర్యూలో చెప్పింది. కన్నడ సినిమాలో 2019లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకుంది.
భారత్ అనే రెండో సినిమా చేసింది. పెద్దగా పేరు రాలేదు. అయితే కన్నడలో మొదటి సినిమా కిస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 24లక్షలు అందుకుంది. తాజాగా పెళ్ళిసందడి మూవీలో నటించినందుకు 30లక్షలు అందుకున్న శ్రీలీల రెండు కార్లు కొంది. బెంగుళూరులో ఖరీదైన ఇంట్లో ఉంటోంది. యష్,హృత్రిక్ రోషన్,రష్మిక మందన్న ఇష్టమైన హీరో హీరోయిన్స్. మాల్ దీవులు ఇష్టమైన ప్రదేశం. ఈమె నెట్ వర్త్ 20కోట్లు. ట్రావెలింగ్,యోగా,పుస్తకాలు చదవడం ఈమె హాబీ.