MoviesTollywood news in telugu

కృష్ణ లక్ష్మీ పుత్రుడు సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే

Super star Krishna movie Lakshmi Putrudu :సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ ఏ కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో కిరాయి కోటిగాడు సినిమా స్టార్ట్ అయి,రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీ రుద్రయ్య ఇలా అన్ని భారీ విజయాలను నమోదుచేశాయి. అయితే కంచు కాగడా, అలాగే కృష్ణ,శోభన్ బాబు నటించిన మహా సంగ్రామం మూవీస్ ని కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసినప్పటికీ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి గానీ, ఎబో ఏవరేజ్ గా నిలిచాయి. అయితే సర్దార్ కృష్ణమ నాయుడు దారుణంగా దెబ్బతింది. ఇక నాగార్జున నటించిన రాముడొచ్చాడు మూవీలో అతిధి పాత్రలో కృష్ణ వేసాడు. అదీ దెబ్బతింది.

ఇలా కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఏడు సినిమాలు కాకుండా లక్ష్మీ పుత్రుడు అనే మూవీ షూటింగ్ కి ముందే ఆగిపోయింది. ఇది చాలా తక్కువమందికి తెల్సిన విషయం. కృష్ణ బావమరిది యు సూర్యనారాయణ బాబు నిర్మించదలిచారు. నిజానికి కోదండ రామిరెడ్డిని సంధ్య మూవీ ద్వారా డైరెక్టర్ గాపరిచయం చేసిన ఘనత సూర్యనారాయణ బాబుదే. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ తో విబేధాల కారణంగా చాలాకాలం దూరంగానే ఉన్నారు.

కానీ 1984లో కంచు కాగడా మూవీ షూటింగ్ సమయంలో కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో మూవీకోసం డేట్స్ ఇస్తానని సూర్యనారాయణ బాబుకి కృష్ణ చెప్పారు. దీనికి కోదండరామిరెడ్డి కూడా ఒకే చెప్పారు. దీంతో మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్బంగా లక్ష్మీ పుత్రుడు మూవీ స్టార్ట్ చేయనున్నట్లు సూర్యనారాయణ బాబు పేపర్ ప్రకటన ఇచ్చారు.

ఆ సమయంలో కృష్ణ డేట్స్ అంటే కాసుల వర్షం కురిసినట్లేనని నిర్మాతల భావన. అందుకే లక్ష్మీ పుత్రుడు టైటిల్ పెట్టారు. ఇది కృష్ణకు నచ్చలేదు. టైటిల్ మార్చమని బావమరిదికి చెప్పారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్యా టైటిల్ విషయంలో చర్చ నడుస్తుండగానే తమిళ రచయిత ఎండి సుందర్ ని పిలిచి ,ఈ టైటిల్ కి తగ్గ కథ రాయమని సూర్యనారాయణ బాబు చెప్పారు.

కథ రెడీ అయి మూడేళ్లు గడిచినా కృష్ణ ఓకే చెప్పలేదు. పైగా మహేష్ తో కల్సి శంఖారావం చేస్తున్నట్లు చెప్పి,లక్ష్మీ పుత్రుడు విషయం మరిచిపొమ్మని సూర్యనారాయణ బాబుకి కృష్ణ తేల్చేశారు. దాంతో 1987లో శంఖారావం మూవీని సూర్యనారాయణ బాబు నిర్మించారు. అయితే కోదండ రామిరెడ్డికి ఇచ్చిన అడ్వాన్స్ అలాగే ఉండిపోవడంతో రమేష్ బాబు,మహేష్ బాబు కాంబినేషన్ లో బజారురౌడీ మూవీని కృష్ణ సూచన మేరకు సూర్యనారాయణ బాబు నిర్మించారు.