MoviesTollywood news in telugu

కృష్ణకు మాస్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఏమిటో తెలుసా?

Tollywood Super star Krishna :నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి, తేనెమనసులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే హీరోగా స్టార్ హోదా అందుకుని సూపర్ స్టార్ అయ్యాడు కృష్ణ. తెలుగు వెండితెర మీదే కాదు, నిజ జీవితంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో సాంకేతిక మార్పులు ఇండస్ట్రీకి తెచ్చాడు.

అల్లూరి సీతారామరాజు మూవీతో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్న కృష్ణ హీరోగానే కాకుండా పద్మాలయ స్టూడియో అధినేతగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న కృష్ణ ఏడాదికి 10సినిమాల చొప్పున చేసారు. మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో దాదాపు 340సినిమాల్లో నటించారు.

ఇటీవల పద్మాలయ శర్మ ఓ ఇంటర్యూలో అక్కినేని కి జరిగిన సన్మానాన్ని చూసి, హీరో అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ గూఢచారి 116తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారని వివరించారు. ఆ సినిమాతో ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా నిలిచారని చెప్పారు. ఇక ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న యుగపురుషుడు అని ఆయన చెప్పారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."