MoviesTollywood news in telugu

మహేష్ కెరీర్ లో ప్రారంభం అయ్యి ఆగిపోయిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…?

Tollywood hero Mahesh babu Movies :క్లాప్ కొట్టిన సినిమాలన్నీ పూర్తికావు. అలాగే షూటింగ్ స్టార్ట్ అయినా కూడా సినిమాలు పూర్తి కావు. సగం షూటింగ్ తర్వాత కూడా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఇందులో ఏ హీరో మినహాయింపు కాదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కూడా భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయి ఆగిపోయిన మూవీస్ ఉన్నాయి.

ప్రస్తుతం సర్కారువారి పాట మూవీ పరశురామ్ డైరెక్షన్ లో వస్తోంది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించే సినిమాల్లో నటిస్తాడని టాక్. కాగా మహేష్ తో ఒక్కడు తర్వాత అర్జున్ మూవీ తెరకెక్కించి విజయం అందుకున్న గుణశేఖర్ దర్శకత్వంలోనే సైన్యం మూవీ తీయడానికి నిర్మాత ఎం ఎస్ రాజు ప్లాన్ చేసారు. పోకిరి కన్నా ముందే ఈ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.

ఈలోగా పోకిరి పూర్తయి, ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో మహేష్ కెరీర్ మారిపోయింది. దాంతో అప్ డేట్ మూవీ కాదన్న కారణంగా సైన్యం ఆగిపోయింది. పైగా సైనికుడు మూవీ డిజాస్టర్ కావడం కూడా సైన్యం ఆగిపోడానికి కారణమైంది. ఇక ఖలేజా మూవీ జాప్యం కారణంగా మిర్చి మూవీ కూడా మహేష్ నుంచి చేజారింది.

అలాగే వరుడు టైటిల్ కూడా మహేష్ కోసం రిజిస్టర్డ్ అయ్యి కూడా ఎందుకో తెరకెక్కలేదు. ఖలేజా జాప్యం కూడా ఇందుకు ఒక కారణమని చెబుతారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినా ఆ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు.

ఇక 40కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్ , కరీనా కపూర్ కాంబినేషన్ లో ఒక మూవీని ప్లాన్ చేసారు. కానీ దూకుడు మూవీ చేయడం వలన ఇది ఆగిపోయింది. మణిరత్నం డైరెక్షన్ లో కూడా ఒక మూవీ ప్రకటన వచ్చి కూడా ఆగిపోయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేయాలనుకున్న జనగణమన మూవీ 2016నుంచి పెండింగ్ లో ఉంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో హరే రామ హరే కృష్ణ మూవీ కూడా అనుకున్నా, అదీ కార్యరూపం దాల్చలేదు. ఇక మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుందని అనుకున్నప్పటికీ కథలో మార్పులు చేయమనడంతో ఆగిపోయింది. అంతేకాదు ఇడియట్, గజినీ, 24వంటి సినిమాలను కూడా రిజెక్ట్ చేయడం ద్వారా హిట్స్ చేజారిపోయాయి.