‘హ్యాపీ డేస్’ అప్పు (గాయత్రీ రావు) ఇప్పుడెలా ఉందో తెలుసా…ఏమి చేస్తుందో…?
Happy days actress appu gayatri rao : మూస సినిమాలతో నడుస్తున్న ఇండస్ట్రీలో సడన్ గా ఎంట్రీ ఇచ్చి, హ్యాపీ డేస్ మూవీతో కొత్త టచ్ ఇచ్చాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ మూవీ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ తో వచ్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా, గాయత్రి రావు వంటి వారంతా హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే కొందరు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు. ముఖ్యంగా హ్యాపీ డేస్ లో నటించిన వాళ్ళల్లో 8 మంది పాత్రలు అందరి మదిలో ఉన్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్నా, లేకున్నా అందులో నటించిన వాళ్లంతా ఇప్పటికీ అదే పేరుతో ప్రేక్షకుల మదిలో నిల్చిపోయారు. ఇందులో గాయత్రీ రావు అప్పు పాత్రతో ఆకట్టుకుంది.
ఈమె పేరెంట్స్ కూడా నటులే. ముఖ్యంగా ఈమె తల్లి బెంగళూరు పద్మగా ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు పొందింది. దాంతో గాయిత్రి రావుకు హ్యాపీ డేస్‌లో ఛాన్స్ రావడంతో తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నటించింది. అయితే గబ్బర్ సింగ్ తర్వాత అవకాశాలు రాకపోవడంతో గాయత్రీ పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిరపడింది.
బరువు పెరిగి పోవడంతో ఇప్పుడు ఈమెను చూస్తే కనీసం గుర్తు పట్టడం కష్టమే. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఛాన్స్ వస్తే మళ్లీ నటిస్తానని చెప్పింది. కాగా 2007లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీ అప్పట్లో దాదాపు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.