“మనసంతా నువ్వే” సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి…?
Mansanatha Nuvve Movie : కెరీర్ ఆరంభంలో వరుసగా ఉదయ కిరణ్ అందుకున్న విజయాల్లో మనసంతా నువ్వే మూవీ ఒకటి. ఉదయ కిరణ్, రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే మూవీ సూపర్ హిట్ అయింది. వి ఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సాంగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఎం ఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా అలరించింది.
200 రోజులకు పైగా కొన్ని సెంటర్స్ లో ఆడిన ఈ సినిమాకు పోటీగా వచ్చిన మూవీస్ చూస్తే, మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన డాడీ మూవీ అక్టోబర్ 4న రిలీజయింది. మనసంతా నువ్వే మూవీకి రెండు వారాల ముందు వచ్చిన ఈ మూవీకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇందులో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది.
ఇక మనసంతా నువ్వే మూవీకి వారం ముందు అక్టోబర్ 12న థాంక్యూ సుబ్బారావు మూవీ రిలీజయింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రియల్ స్టార్ శ్రీహరి కామెడీ గల పాత్రతో అలరించారు. అయితే సినిమా నిరాశపరిచింది. శ్రీకాంత్, అంజలా జవేరి హీరో హీరోయిన్స్ గా నటించిన ప్రేమ సందడి మూవీని పిఎ అరుణ్ ప్రసాద్ తెరకెక్కించాడు. అయితే ఈ మూవీ ప్లాప్ అయింది.
మనసంతా నువ్వే విడుదలైన వారం తర్వాత అక్టోబర్ 26న స్నేహమంటే ఇదేరా మూవీ వచ్చింది. నాగార్జున, సుమంత్ కల్సి నటించిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా చేసింది. ఏవరేజ్ గా నిల్చింది. హీరో శివాజీ నటించిన ముక్కోణ ప్రేమ కథా చిత్రం స్నేహితుడా మూవీని కె ఎస్ నాగేశ్వరరావు డైరెక్ట్ చేసాడు. అయితే ఈ మూవీ పరాజయం చవిచూసింది.
రోహిత్, అను జంటగా నటించిన ముత్యం మూవీ కూడా అక్టోబర్ 26నే వచ్చింది. వాసన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆకట్టుకోలేదు. కన్నడ హీరో ఉపేంద్ర నటించిన రా మూవీ నవంబర్ 1న అంటే మనసంతా నువ్వేకి రెండు వారాల గ్యాప్ తో వచ్చింది. బిసి సెంటర్స్ లో మంచి రన్ సాధించింది. మొత్తం మీద హిట్ టాక్ తెచ్చుకుంది.

