MoviesTollywood news in telugu

మెగాస్టార్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి

Tollywood Hero Chiranjeevi And Rajamouli :సోషల్ మీడియా కారణంగా ప్రతిరోజు అభిమానులతో, నెటిజన్స్ తో ముచ్చటించే ఛాన్స్ ఎలబ్రిటీలకు వచ్చింది. దీనికి తోడు యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్యూలు కూడా బాగానే వచ్చేస్తున్నాయి. పాత సంఘటనలు కూడా ప్రస్తావిస్తూ ముచ్చట్లు షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలోని ఒక సన్నివేశం గురించి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తావిస్తూ హాట్ కామెంట్స్ చేసాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. సాంగ్స్ కూడా హైలెట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలో చిరంజీవిని తల మాత్రమే కనిపించేలా ఉంది కప్పెట్టడం, అతడి గుర్రం సాయంతో చిరంజీవి బయటకు రావడం సన్నివేశం గురించి జక్కన్న ప్రస్తావిస్తూ ,తనను కాపాడిన గుర్రానికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పకుండా వెళ్లిపోవడం తనకు నచ్చలేదని రాజమౌళి పేర్కొన్నాడు.

అయితే దర్శకుడు చెప్పినట్లు చేయాలి కనుక ఇక్కడ చిరంజీవిని తప్పుబట్టలేమని నెటిజన్ల ప్రశ్నకు సమాధానంగా జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ ఘటన తన మదిలో ముద్రవేసుకుందని, అందుకే మగధీర మూవీలో రామ్ చరణ్, గుర్రం సీన్లు రాసుకున్నానని, అందుకే అద్భుతంగా పండాయని చెప్పుకొచ్చాడు. స్వయంకృషితో పైకి వచ్చిన చిరంజీవి సినిమా గురించి అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.