ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో.. ఈ ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టారా..

సినిమా స్టార్స్ వ్యక్తిగత విషయాలు అన్నీ అభిమానులకు ఎప్పటికప్పుడు ఎరుకే. గతంలో కొంత దాపరికం ఉన్నా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏదీ దాగడం  లేదు. ఇక ఫాన్స్ అయితే  తమ అభిమాన హీరోయిన్, హీరోల ఫోటోలను చాలా పదిలంగా దాచుకుంటారు. పైగా సోషల్ మీడియాలో తమ అభిమాన తారల చిన్ననాటి ఫోటోలు విస్తృతంగా నెట్టింట్లో కన్పిస్తున్నాయి.
 
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కాదు, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ . ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా. ఈమె హీరోయిన్ గా అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది. బుల్లితెర మీద కూడా జబర్దస్త్, మా ఇంటి మహాలక్ష్మి వంటి ప్రోగ్రామ్స్ తో అదరగొట్టింది.

ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గా  రెండు సార్లు గెలిచి, 49వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రోజా అభిమానులు ఆమె ఫొటోలతో సోషల్ మీడియాలో హంగామా చేసారు. ఎపి ఐ ఐ సి చైర్ పర్సన్ గా ఉంటున్న ఆమెకు త్వరలో మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని టాక్.