MoviesTollywood news in telugu

అలనాటి హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఎవరో చూసేయండి

Tollywood heroine Jayasudha : సినిమా నటీనటుల జీవితాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. సామాన్యుల మాదిరిగా వాళ్లకి కష్టాలు, అనారోగ్యాలు ఉంటాయి. ఇక సహజ నటిగా పేరొందిన జయసుధ హీరోయిన్ గా అప్పట్లో అగ్ర హీరోల సరసన వేసి మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రాధ్యాన్యత గల అమ్మ, వదిన పాత్రలు వేస్తూ మెప్పిస్తోంది. జయసుధ 14 ఏళ్ల వయసులో వెండితెరపై మెరిసి, దాదాపు నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంటోంది.

జయసుధ తన సినీ కెరీర్ లో ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా చేసిన మహర్షి, బాలకృష్ణ నటించిన రూలర్‌ మూవీస్ తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించక పోవడానికి కారణం ఏమిటబ్బా అని ఆరా తీస్తే ఈ మధ్య ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారని తేలింది.

అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదేంటి జయసుధ అలా అయిపోయిందేంటి అని చర్చ నడుస్తోంది. జయసుధ భర్త నితిన్‌ కపూర్‌ 2017లో మరణించగా, ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా చేశారు.

అయితే ‘స్మైల్..ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ తాజాగా ట్వీట్‌ చేసింది. నిండైన మొముతో కాస్త లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో మాత్రం పీక్కుపోయి పూర్తి భిన్నంగా కన్పించింది. అయితే కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు టాక్. దీంతో అసలు ఏమై ఉంటుందా అని ఆమె ఫ్యాన్స్ ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.