MoviesTollywood news in telugu

చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Tollywood Heroine shriya saran : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించి, ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న శ్రియ దాదాపు అందరి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ సైతం చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే ఈమె చిన్నప్పటి ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాను సెలబ్రిటీలు విస్తృతంగా వినియోగించడం వలన ఎప్పటికప్పుడు విషయాలను షేర్ చేస్తున్నారు. తాము నటిస్తున్న సినిమాల గురించి చెప్పటమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ,ఇన్‌స్టా లైవ్‌ల ద్వారా అభిమానులతో హీరోలు, హీరోయిన్లు సంభాషిస్తున్నారు.

ఫాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అంతేకాదు, ఏదైనా పండుగ నాడు, పుట్టినరోజు నాడు హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా తన అందం, అభినయంతో రాణిస్తున్న శ్రియా శరన్ తాజాగా చిన్నప్పటి ఫోటో పోస్ట్ చేసింది.

చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు అదిరిపోయే ఫోజిచ్చిన ఈమె ఎవరా అని ఆరా తీసిన ఫాన్స్ ఇంతకీ ఈమె శ్రియ అని తెలియడంతో ఈ ఫోటోలను క్షణాల్లో వైరల్ చేసేసారు. కామెంట్స్ కూడా పెడుతున్నారు.