MoviesTollywood news in telugu

దాన వీర శూర కర్ణలో అక్కినేని నటించకపోవటానికి అసలు కారణం ఇదే…?

Danaveera soora karna movie : ఎన్టీఆర్ కంటే ముందుగానే సినిమా రంగంలోకి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి హిట్స్ అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ రాకతో అక్కినేని రూటు మార్చుకుని తన పర్సనాల్టీకి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ఆడియన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు.

ఇక ఎన్టీఆర్ అయితే పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా మారిపోయారు. జానపద చిత్రాల్లో కూడా తడాఖా చూపిస్తూ, సాంఘిక చిత్రాల్లో కూడా సత్తా చాటారు. రెండు మూడు పాత్రలు వేస్తూ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకున్నారు. దాన వీర శూర కర్ణ మూవీ చేసే ముందు అక్కినేనికి ఓ పాత్ర అఫర్ ఇచ్చారట ఎన్టీఆర్.

కానీ అక్కినేని అందుకు ఒకే చెప్పలేదు. అప్పటి సీఎం జలగం వెంగళరావు కోరిక మేరకు కర్ణుడి పాత్రకోసం అక్కినేని ని ఎన్టీఆర్ అడిగితె అలాంటి పాత్రలు తనకు సూటవ్వవని తిరస్కరించారు. 4గంటల 17నిమిషాల నిడివితో తీసిన ఈ మూవీలో కృష్ణుడు, దుర్యోధనుడితో పాటు కర్ణుడి క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ చేసి మెప్పించారు. అప్పట్లో కోటి రూపాయల కలెక్షన్ రాబట్టిన ఈ మూవీ సెకండ్ రిలీజ్ లో కూడా కోటి తెచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."