MoviesTollywood news in telugu

టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టిన హీరోలు, దర్శకులు ఎంత మంది ఉన్నారో…?

Hat trick combination in tollywood industry : టాలీవుడ్ లో గానీ, మరే ఇతర భాషల్లో గానీ కొందరి హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ కి మంచి డిమాండ్ ఉంటుంది. ఆడియన్స్ లో క్రేజ్, ఫాన్స్ కి మజా ఇచ్చే కాంబినేషన్లు చాలానే వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. నందమూరి హరికృష్ణ సినేషనల్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కాంబినేషన్ లో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య మూవీస్ రావడంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం జరిగింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌‌‌లో తాజాగా వచ్చిన అఖండ మంచి టాక్ తో ఫాన్స్ ని అలరిస్తోంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్ కావడంతో భారీ అంచనాలతో నడుమ అఖండ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి టాక్ సొంతంచేసుకుంది. దీంతో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ అందుకుంది.

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌‌‌గా నటించగా, తమన్ సంగీతం సమకూర్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్. తర్వాత వచ్చిన సింహద్రి, యమదొంగ మూవీస్ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇక రామ్ చరణ్, తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జక్కన్న డైరెక్షన్ లో వస్తోంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించిన తొలిసినిమా జులాయి సూపర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా హిట్ అయింది. ఇక అల వైకుంఠపురములో మూవీ అయితే బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

ఇంకో కాంబినేషన్ చూస్తే, మాస్ మహారాజ్ రవితేజ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి మూవీస్ హిట్ కొట్టడంతో హ్యాట్రిక్ సాధించారు. అయితే దేవుడు చేసిన మనుషులు, నేనింతే మూవీస్ నిరాశ పరిచాయి. అలాగే రవితేజ, డైరెక్టర్ మలినేని గోపీచంద్ కాంబోలో డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు వచ్చి హ్యాట్రిక్ కొట్టాయి.