MoviesTollywood news in telugu

ఆ సీన్ కోసం శారద ఎన్ని టేకులు తీసుకుందో తెలుసా?

Tollywood actress sarada :కళాతపస్వి కె విశ్వనాధ్ నటీనటుల నుంచి తనకు కావాల్సిన రీతిలో నటనను రాబట్టుకోవడంలో దిట్ట. అందుకే ఒకటి పది సార్లు టేకులు అయినా సరే, విసుగు లేకుండా నటులకు ఇబ్బంది లేకుండా అభినయం తనకు నచ్చిన రీతిలో వచ్చేలా చేసుకుంటారు. అందుకే విశ్వనాధ్ సినిమాలో నటించాలని అగ్ర నటులు సైతం పరితపించేవారు.

ఇక ఊర్వశి శారదగా పేరొందిన నటి శారద ఒకప్పుడు హీరోయిన్ గా చేసి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, అత్త, ఇతర క్యారెక్టర్ రోల్స్ తో దుమ్మురేపింది. హీరోయిన్ గా ఉన్నప్పుడు జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డులు గెలుచుకుంది. అయితే విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన ఒక సినిమాలో ఏకంగా 20 టేకులు తీసుకుందట.

అప్పటికి గానీ డైరెక్టర్ విశ్వనాధ్ సంతృప్తి చెందలేదట. ఆ సినిమా పేరు కూడా శారద కావడం విశేషం. అందులో శోభన్ బాబు డాక్టర్ గా, శారద భర్తగా నటించాడు. ఆ సినిమాలో శారద అన్నయ్య డాక్టర్ కోసం వెళ్లి శోభన్ బాబు ని తీసుకొస్తాడు. వచ్చింది తన భర్తే అనుకుని ‘నేనేం తప్పు చేసానని వెళ్లిపోయారండి, నావలన తప్పు జరిగితే తిట్టొచ్చు కదండీ అని కాళ్ళమీద పడి, ఏడుస్తుంది. ఈ సీన్ కోసం ఏకంగా 20 టెక్ లు తీసుకుందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."