MoviesTollywood news in telugu

పాపే మా జీవన జ్యోతి సీరియల్ శంభు రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

paape maa jeevana jyothi serial : ఛానల్స్ లో పోటాపోటీగా వస్తున్న సీరియల్స్ లో భాగంగా స్టార్ మా ఛానల్ లో పాపే మా జీవన జ్యోతి సీరియల్ ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్న శంభు తన అందంతో,నటనతో ముఖ్యంగా హైట్ పర్సనాల్టీతో ఆకట్టుకుంటున్నాడు. బుల్లితెర ఆడియన్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

1982జూన్ 17న విజయవాడలో జన్మించిన శంభు అసలు పేరు అల్లూరి లక్ష్మి రాజా. అయితే యితడు చెన్నైలో పెరిగాడు.ఎస్ కె పివివి హిందూ స్కూల్, శాతవాహన కాలేజీ లలో స్టడీస్ పూర్తి చేసిన శంభు కి గాయత్రి అనే నటితో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. శంభు,గాయత్రిలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు విషయాలను షేర్ చేస్తున్నారు.

నటనపై ఆసక్తి గల శంభు మయూరి మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు తెలుగు, తమిళ మూవీస్ చేసాడు. అలాగే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో చేసాడు. తెలుగులో కృష్ణవేణి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పాపే మా జీవన జ్యోతి వంటి సీరియల్స్ తో మెప్పిస్తున్నాడు. శంభు , గాయత్రి ఓ ట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ ప్రోగ్రామ్స్ అప్ లోడ్ చేస్తున్నారు.