ఈ హీరో ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Tollywood Hero aditya om :విలన్ల కొరత కావచ్చు, మరొకటి కావచ్చు ఒకప్పుడు హీరోలుగా వేసినవాళ్లు, క్యారెక్టర్ యాక్టర్ లుగా సక్సెస్ కొట్టినవాళ్లు ఇప్పుడు విలన్లుగా యాక్ట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ కి మరో విలన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతనెవరో కాదు, ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో మూవీలో లీడ్ రోల్ పోషించిన ఆదిత్య ఓం. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ లో అడుగుపెట్టాడు.

తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు హిందీ సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి ఆదిత్య ఓం నటుడిగా అన్ని రకాల పాత్రలకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలీవుడ్‌లో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు నెగెటివ్ రోల్ లో చేస్తున్నాడు. ఒకటి కాదు, ఏకంగా మూడు సినిమాల్లో విలన్ గా మెప్పించడానికి రెడీ అయ్యాడు.

ఈ మూడు సినిమాల్లో తన నెగెటివ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో చూపించానని ఆదిత్య ఓం ఓ ఇంటర్యూలో చెప్పాడు. నేటితరం ప్రేక్షకులు సైతం నటులు తమ పరిమితులను అధిగమించాలని కోరుకుంటున్నందున , ప్రస్తుతం తాను అదే బాటలో ఉన్నానని అన్నాడు. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న నాగ వర్మతో కలిసి విక్రమ్ మూవీలో మాఫియా బాస్‌గా ఆదిత్య ఓం నటించడంతో పాటు ‘అమరం (నగరంలో), పవిత్ర అనే మరో రెండు సినిమాల్లో విభిన్నమైన విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

అమరం సినిమాలో ఆది సాయి కుమార్‌తో కలిసి నటిస్తున్న ఆదిత్య.. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన హ్యాకర్ రోల్‌లో కన్పిస్తాడు. అలాగే జ్యోతి, గాయత్రి గుప్తాతో కలిసి పవిత్ర అనే వెబ్ ఫిల్మ్‌లో సైకోటిక్ డాక్టర్ వేషం వేస్తున్నాడు. త్వరలో ఈ మూవీస్ విడుదలకు రెడీ కాబోతున్నాయి.