MoviesTollywood news in telugu

కియారా అద్వానీ కారు ధర తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood Actress kiara advani : సెలబ్రిటీల గురించి ఏ విషయం కూడా దాగడం లేదు. అందునా సోషల్ మీడియా వచ్చాక పలు విషయాలు వాళ్లే షేర్ చేస్తున్నారు. దాంతో ఎప్పటికప్పుడు విషయాలు ఫాన్స్ కి తెలిసిపోతున్నాయి. ఇక దీంతో పాటు వాళ్ళు వాడే ఖరీదైన కార్లు, షూస్, వాచీలు, చీరలు, బాగ్స్ ఇలా అన్నీ వైరల్ అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న కియారా అద్వానీకి సంబంధించిన కారు గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఆకట్టకుంటూ కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్‌ అనే నేను మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

వరుస విజయాలతో అదరగొడుతున్న ఈ భామ వ్యక్తిగత జీవితం కూడా రిచ్‌గానే ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన కార్లు అంటే చాలా ఇష్టం. ఎన్ని అయినా కోనేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఎండబ్ల్యూ ఎక్స్‌5, మెర్సిడెజ్‌ బెంజ్‌ ఈ-క్లాస్‌, బీఎండబ్ల్యూ 530డీ వంటి విలావంతమైన కార్లు ఉండగా తాజాగా వీటి జాబితాలో ఆడి ఏ8 ఎల్‌ కూడా కొనేసింది.

ఈ ఆడి ఈ మోడల్‌ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ లగ్జరీ కారు ప్రారంభ ధర రూ.1.56 కోట్లని టాక్. దీనిపై నెట్టింట చర్చ సాగుతోంది. కాగా ఎంఎస్‌ ధోనీ, కబీర్‌ సింగ్‌, లక్ష్మీ, లాంటి బాలీవుడ్‌ సూపర్ హిట్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, తాజాగా శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడీగా నటించే చాన్స్‌ అందిపుచ్చుకుంది. ఇప్పటికే ఒక చిత్రంలో చెర్రీతో కల్సి చేసిన కియారా ఇప్పుడు రెండో చిత్రం కూడా చేస్తోంది.