MoviesTollywood news in telugu

సుజాత స్టార్ హీరోయిన్ కాకపోవటానికి అసలు కారణం ఇదే…!

Tollywood Heroine Sujatha : ఒకప్పటి హీరోయిన్ గా ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో పలు కీలక పాత్రలు పోషించిన సుజాత దాదాపు అందరి అగ్ర నటులతో నటించింది. దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన గోరింటాకు, ఏడంతస్తుల మేడ , అలాగే అనుబంధం మూవీస్ లో ఆమె నటన హైలెట్ గా ఉంటుంది.

అక్కినేని, శోభన్ బాబు తదితర నటుల సరసన నటించి యుగళ గీతాలు పంచుకున్న సుజాత నటిగా ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కరుణ రసాన్ని పండించడంలో సుజాతకు సాటిరారు ఎవ్వరు అని అంటారు. అయితే హీరోయిన్ గా చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. నిజానికి ఈమె చాలా సినిమాలను కూడా వదిలేసుకుందని అంటారు.

కె బాలచందర్ ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన సుజాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషా చిత్రాల్లో చేసి మెప్పించింది. చంటి మూవీలో వెంకటేష్ తల్లిగా, శ్రీరామదాసు మూవీలో భక్తురాలిగా మెప్పించిన సుజాత తన మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే చేసేది. దీంతో చాలామంది ప్రొడ్యూసర్స్ కి ఈమె శైలి నచ్చేది కాదని అందుకే స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని టాక్.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."