MoviesTollywood news in telugu

రజనీకాంత్ ఎంత మంది హీరోలతో కలిసి నటించాడో తెలుసా ?

Super Star rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటన వినూత్నంగా ఉంటుంది. అందుకే తక్కువ టైంలోనే తమిళంలో స్టార్ హీరోగా ఎదగడమే కాదు, తమిళ, కన్నడ, తదితర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అన్ని చోట్లా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. డబ్బింగ్ సినిమాలే కాదు, తెలుగుతో పాటు పలు భాషల్లో అగ్ర నటులతో కల్సి నటించాడు.

నటరత్న ఎన్టీఆర్ తో కల్సి టైగర్ సినిమాలో నటించిన రజనీకాంత్, సూపర్ స్టార్ కృష్ణతో ఇద్దరూ అసాధ్యులే, శోభన్ బాబుతో కల్సి జీవన పోరాటం మూవీలో చేసాడు. మెగాస్టార్ చిరంజీవితో కల్సి కాళీ, బందిపోటు మూవీస్ చేసాడు. ముమ్ముట్టితో కల్సి దళపతి మూవీ చేసాడు. తన ఆత్మీయ ఫ్రెండ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కల్సి పెదరాయుడు మూవీ ప్రత్యేకంగా చేసాడు.

బాలీవుడ్ నటులు దివంగత నటులు ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, అలాగే కన్నడ స్టార్ అంబరీష్ తో కల్సి రజనీకాంత్ నటించాడు. బిగ్ బి అమితాబ్ తో కల్సి బ్లైండ్ లాన్, హమ్ మూవీస్ లో రజనీకాంత్ నటించాడు. కన్నడ సూపర్ స్టార్ విష్ణు వర్ధన్ తో కల్సి రాఘవేంద్ర స్వామి మహత్యం మూవీలో చేసాడు.

మలయాళ నటుడు మోహన్ లాల్ తో కల్సి రజనీ నటించాడు. అలాగే షారుఖ్ ఖాన్ తో కల్సి చెన్నై ఎక్స్ ప్రెస్, హృత్రిక్ రోషన్ తో కల్సి భగవాన్ దాదా మూవీస్ చేసాడు. సునీల్ శెట్టితో కల్సి దర్బార్ మూవీ, రోబో 2. 0లో అక్షయ కుమార్ తో కల్సి నటించాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."