MoviesTollywood news in telugu

తిరుమల దర్శనంలో సమంత వెంట ఉన్న ఈమె ఎవరో తెలుసా?

Tollywood Heroine Samantha :హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సినీ నటి సమంత పేరు మారు మోగిపోతోంది ఈమెకు ఓ మంచి అలవాటు ఉంది. అదే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం. గతంలో మజిలి చిత్రం రిలీజ్ అయ్యే 3 రోజుల ముందు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

అలాగే సమంత ప్రధానపాత్రలో వచ్చిన ఓ బేబీ సినిమా రిలీజ్‌‌కి నాలుగు రోజుల ముందు శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. ఇప్పుడు బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వస్తోన్న పుష్ప సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేయగా, ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అయింది. దీంతో ఆమె సినిమా విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత వెంట ఆమె ఫ్యాషన్ డిజైనర్, స్నేహితురాలు కూడా అయిన శిల్పారెడ్డి కూడా ఉంది. సమంతతో ఆమెకి చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. చైతూతో విడాకుల తర్వాత సామ్ చేసిన పనుల్లో ఆమె దగ్గరగా ఉంటోంది. ఓ రెండు నెలల క్రితం సామ్ అనేక టూర్స్‌‌‌లో సమంత వెంట శిల్పారెడ్డి ఉంది.

సామాన్య భక్తులతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకోగా, అనంతరం ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ప్రస్తుతం శాకుంతలం అనే సినిమా కూడా సమంత పూర్తిచేసి, యశోదతో పాటు పలు సినిమాలతో బిజీ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."