MoviesTollywood news in telugu

విక్టరీ వెంకటేష్‌కు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

Tollywood Hero Venkatesh assets : టాలీవుడ్ మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా టాలీవుడ్ హీరోగా కలియుగ పాండవులు మూవీతో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ విభిన్న పాత్రలతో వరుస విజయాలు అందుకుని విక్టరీ వెంకటేష్ అయ్యాడు. అంతేకాదు, అందాల నటుడు శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా కూడా నిలిచాడు. దాదాపు 80 సినిమాలకు పైగా నటించిన వెంకీ ఇండస్ట్రీ హిట్స్, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేసి తనకు తానే అనిపించుకున్నాడు.

ఇటీవల నారప్ప, దృశ్యం 2 సినిమాలకు సైతం ప్రైమ్ వీడియోలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలను 70 కోట్ల వరకు సురేష్ బాబు విక్రయించాడని టాక్ నడుస్తోంది. 60ల్లో పడినా ఇంకా కుర్ర హీరోలతో సమానంగా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు.

35 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వెంకీ ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉంటాయో తెలీదు. అంతెందుకు, హైదరాబాద్‌లో వెంకీ ఇల్లు కొండపై ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. సినిమాల నుంచి వెంకీ సంపాదించిన మొత్తాన్ని అన్న సురేష్ బాబు సలహాతో బిజినెస్‌, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాడట. దాంతో అతడి ఆస్తి విలువ దాదాపు 2200 కోట్ల వరకు ఉంటుందని టాక్.

ఇక తన తండ్రి ద్వారా వారసత్వంగా వెంకీకి వచ్చిన ఆస్తులు చాలానే ఉన్నాయని, మొత్తం చూస్తే, వెంకీ ఆస్తులు 5 వేల కోట్లకు పైమాటే అని అంచనా. వెంకటేష్ సినిమా కెరీర్ విచిత్రంగానే జరిగింది. రాఘవేంద్రరావు – కృష్ణ కాంబినేషన్‌లో రామానాయుడు మూవీ తీయాల్సి ఉంది. అయితే మీ అబ్బాయితో తీయమని కృష్ణ సూచనతో వెంకీ హీరోగా మారాడు. బిజినెస్ మ్యాన్ కావాలనుకుని హీరోగా మారిన వెంకీ స్టార్ హీరోగా రాణిస్తూ, టాలీవుడ్‌లో అత్యధిక నంది పురస్కారాలు అందుకున్నాడు. అంతేకాదు, వ్యాపారవేత్తగా వెంకీ తన సత్తా చూపిస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."