MoviesTollywood news in telugu

పుష్ప సినిమాలో నటించిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా?

pushpa actor jagadish : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ – స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో డిసెంబర్‌ 17న విడుదలైన’పుష్ప’సినిమా దుమ్మురేపుతుంది. అంచనాలకు తగ్గట్టు హిట్‌ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అల్లు అర్జున్‌ ఊర మాస్ క్యారెక్టర్ పుష్పరాజ్‌గా అదరగొట్టగా, రష్మిక మందన్నా శ్రీవల్లిగా కనువిందు చేసింది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయిన పుష్ప ప్రస్తుతం సక్సెస్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన పుష్ప మూవీలో కొత్తగా వరంగల్ కి చెందిన జగదీశ్ అనే యువకుడు ఓ నటుడుగా కన్పించాడు. అతడికి ఇదే తొలి సినిమా కాదు. ఇంతకీ ఇతనెవరబ్బా అని నెటిజన్స్ సెర్చ్ చేయగా పలాస మూవీలో శ్రీకాకుళం యాసలో అదరగొట్టిన నటుడే యితడు. అప్పట్లో ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

పుష్పలో చిత్తూరు యాసలో మాట్లాడి నటనతో మెప్పించిన జగదీశ్ నిజానికి బన్నీ నటించిన ఎన్నో సినిమాలు చూసాడు. అయితే బన్నీ నుంచి కబురు వస్తుందని, అతనితో కల్సి నటిస్తానని మాత్రం ఊహించలేదట. బన్నీతో కల్సి ఒక సీన్ లో మాత్రమే కనిపిస్తానని అనుకున్నానని, అయితే సినిమా మొత్తం కన్పించడం ఆనందంగా ఉందని ఇటీవల ఓ ఇంటర్యూలో జగదీశ్ చెప్పాడు. బహుశా పలాస మూవీలో నటన చూసి పిలిచి ఉంటారని చెప్పాడు.