MoviesTollywood news in telugu

రెమ్యునరేషన్ పై గీతామాధురి షాకింగ్ కామెంట్స్ వైరల్…ఏమిటో…?

Tollywood singer geetha madhuri :టాలీవుడ్ సింగర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి తాజాగా జై బాలయ్య సాంగ్ తో హిట్ అందుకుంది. అయితే ఈ పాటకు రెమ్యునరేషన్ విషయంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిజానికి నందమూరి హీరోల సినిమాలకు ఈమె పాడుతున్న సాంగ్స్ హిట్ అవుతున్నాయి. సాంగ్ కి రెమ్యునరేషన్ అడిగితె నువ్వు కూడా రెమ్యునరేషన్ అడుగుతున్నావా అనే కామెంట్స్ చేస్తారని ఆమె వాపోయారు.

థమన్ మ్యూజిక్ లో వచ్చిన అఖండ మూవీలో జై బాలయ్య సాంగ్ మంచి ఊపు మీద సాగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏ పాటకు ఎంతివ్వాలో ఫిక్స్ చేస్తారని చెప్పిన ఆమె తన సాంగ్ కి ఎంత అందుకుందో మాత్రం చెప్పలేదు. పైగా తాను ఇంత కావాలని కూడా ఎప్పుడూ ఎవరినీ అడగలేదని చెప్పింది.

ఆమె కామెంట్స్ చక్కర్లు కొడుతుండడంతో చర్చ సాగుతోంది. చిరుత, గుడ్ మార్నింగ్, ఏక్ నిరంజన్ వంటి మూవీస్ కి పనిచేసిన గీతా మాధురి బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. హైదరాబాద్ వనస్థలిపురంలో చదువుకున్న ఈమె ప్రేమలేఖరాశా మూవీలో పాడడం ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. నచ్చావులే మూవీలో నిన్నే నిన్నే కోరా సాంగ్ తో బాగా పాపులర్ అవ్వడమే కాదు నంది అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక షార్ట్ ఫిలిమ్స్ లో నటించే సమయంలో నటుడు నందుతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి, 2014లో పెళ్లి చేసుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."