MoviesTollywood news in telugu

పుష్ప పార్ట్ 2… ఏంటి కథ.. మరో పవర్‌ఫుల్ విలన్…ఎవరో…?

pushpa Movie Second Part : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఇప్పటికే కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ, ఎక్కడా తగ్గేదిలే అన్నట్లు నడుస్తోంది. బన్నీ ఇందులో పుష్పరాజ్ పాత్ర చేసాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా ఊర మాస్ క్యారెక్టర్ లో అదరగొట్టాడు. ఎంతటి విలన్ అయినా పుష్ప రాజ్ ముందు తలవంచాల్సిందే అన్నట్లుగా బన్నీ నటించాడు.

అయితే పుష్ప పార్ట్ 2లో కూడా విలన్ కి ధీటుగా బన్నీ ఎంట్రీ ఇస్తాడని అప్పుడే టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్ట్ 2లో పుష్ప రాజ్ తండ్రి ఎవరు అనేది ఆడియన్స్‌కి తెలియాల్సి ఉంది. అజయ్ క్యారెక్టర్ కూడా క్లియర్ గా లేదు. అందుకే వీటన్నింటికీ పుష్ప దిరూల్‌లో ఓ క్లారిటీ ఇచ్చేలా సుకుమార్ ట్రీట్ మెంట్ ఇస్తున్నాడని టాక్.

ముఖ్యంగా స్పెషల్ సాంగ్ తో సహా అన్ని సాంగ్స్ అదరగొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 2లో కూడా మంచి బాణీలు అందించ బోతున్నట్లు అలాగే స్పెషల్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కి సమంత ను ఒప్పిస్తారా మరొకరిని తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

ఇక జాలీ రెడ్డిగా కనిపించిన కన్నడ నటుడు ధనుంజయ్‌కి పార్ట్1లో ప్రాధాన్యత లేకపోవడంతో అతడి పాత్ర కూడా పుష్ప 2లో కొనసాగుతుందని భావిస్తున్నారు. అలాగే పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్ సింగ్ పార్ట్ 2లో కక్ష తీర్చుకుంటాడని అంచనా వేస్తున్నారు. మంగళం శీను, దాక్షాయణి క్యారెక్టర్స్ కూడా సెకండ్ పార్ట్ లో ఎలాంటి పగ తీర్చుకుంటాయన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద పుష్ప 2మీద అంచనాలు మాములుగా లేవు.