సాయిపల్లవి రెమ్యునరేషన్ ఏ రేంజ్ లో ఉందో తెలుసా ?
Tollywood Heroine Sai Pallavi remuneration : ఓ పక్క వరుస అవకాశాలను దక్కించుకుంటూ, నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ, టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయిన సాయిపల్లవి తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. అంతేకాదు,ఓ సంస్థ సర్వే ప్రకారం రెమ్యునరేషన్ విషయంలో సమంత, అనుష్కల రేంజ్ కి చేరిందని టాక్.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ థియేటర్లలో విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్గా నిల్చి, నిర్మాతలకు కలెక్షన్స్ కూడా రాబట్టింది. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజయింది. ఇందులో సాయి పల్లవి దేవదాసి పాత్రలో మెప్పించింది.
అలాగే విరాట పర్వం సినిమా కూడా చేస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నక్సలైట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో సాయిపల్లవి పేదింటి యువతిగా చేస్తోంది. ఒక్కో మూవీకి కోటి నుంచి కోటిన్నర వరకు ఛార్జి చేస్తోందట. ఒక్క 2021 లో సాయి పల్లవి మూడు మిలియన్ డాలర్ల వరకు సంపాదించిందని టాక్.
సమంత సినిమాకు రూ. 2 నుంచి 3 కోట్ల వరకు తీసుకుంటుంటే, అనుష్క రెండు కోట్ల వరకూ అందుకుంటోంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. లేకుంటే వదిలేస్తుంది. అలా వదిలేసిన మూవీస్ వలన గత 3ఏళ్లలో 7కోట్ల దాకా నష్టపోయిందట.
ఇక యంగ్ హీరోలు సాయిపల్లవిని హీరోయిన్ గా చేస్తే చాలు అన్నట్లు ఉన్నారు. ఫిదా సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సాయి పల్లవి తొలిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అందరినీ ఫిదా చేసింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
