MoviesTollywood news in telugu

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రామ్ చరణ్…ఏంతో తెలుసా ?

Tollywood Hero ram charan remuneration : స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆర్ సి 15పేరిట షూటింగ్ కూడా స్టార్ట్ కావడం ఒక షెడ్యూల్ పూర్తవ్వడం జరిగాయి. ఇదే సమయంలో ఆర్ సి 16 పేరిట మరో సినిమా కూడా చెర్రీ చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

మాములుగా అయితే 50కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటుండగా, భారీగా పెంచేసాడట. 100 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు టాక్. జూనియర్ ఎన్టీఆర్ తో కల్సి తాజాగా నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7న రిలీజ్ కానుంది. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా వస్తోంది.

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీని రామ్ చరణ్ నిర్మిస్తుండటమే కాకుండా కీలక పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 4న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటన కూడా వచ్చింది.